Daily Archive: August 31, 2026

ఆదివాసి గిరిజన బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నటువంటి అదివాసి గిరిజన బిడ్డ శిరీషను శానాద్ ఉల్లా ఖాన్ అనే వ్యక్తి మానభంగం చేసి చంపాడు పోలీసులు ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియా...

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక

ఆమనగల్ మున్సిపాలిటీ మరియు కడ్తాల్ మండలం  కర్కల్  పహాడ్ గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  హాజరై అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కౌన్సిలర్స్ మొక్తల వెంకటయ్య, నాగిళ్ళ జగన్,ఎర్రవోలు మహేష్,ఎనుముల రమేష్, కర్కల్ పహాడ్ గ్రామం సర్పంచ్ తేజురాం,సీనియర్ నాయకులు అల్లాజీ గౌడ్,రచ్చ.శ్రీరాములు,మైసయ్య,ఎగిరిశెట్టి వీరయ్య,జంతుక జానయ్య, గంగ రవి గౌడ్,నిరంజన్ గౌడ్,పూసల సత్యం,జంతుక కిరణ్, వస్పుల శ్రీశైలం,కుమార్ గౌడ్,సతీష్ గౌడ్, బాలకృష్ణ గౌడ్,గుండ్రాతి నరేష్ గౌడ్,పట్నం రాఘవేందర్,వీరయ్య వడ్డే,విష్ణు,కృష్ణ,మహేష్,అశోక్, జిలీల్,తో పాటు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపనలో పాల్గొన్న.. సుంకిరెడ్డి

వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై అమ్మవారి ప్రతిష్టాపన అనంతరం శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొని,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం సుంకిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులతో గొప్ప స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పర్వతాలు,ఉప సర్పంచ్ నరసింహ,సీనియర్ నాయకులు బొజ్జయ్య, అల్లాజీ,కొండల్, లింగం,మల్లేష్,శ్రీశైలం,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రాజు, జంగయ్య,కొండల్ యాదవ్,చంద్ర శేఖర్ ఆలయ నిర్వాహకులు,గ్రామ పెద్దలు,యువత,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చెర్కూర్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీల వితరణ

వెల్దండ ఆగస్టు 31: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీలను సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు  సలహా మేరకు  అదే గ్రామంలో చెందిన రైతు మండేగుత్తల శశిధర్  అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం దాతకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మైసయ్య,భీమయ్య గౌడ్, అల్లె సందీప్, చంద్రమౌళి రామచంద్రయ్య పాఠశాల ఉపాధ్యాయురాలు, లింగయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

డిసిసి డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్

కల్వకుర్తి ఆగస్టు 31: వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన డా. ఎం. విజయ్‌కుమార్ ను జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నియామక ఉత్తర్వులను డా. హరికాంత్ రెడ్డి జనరల్ సెక్రటరీ, టీపీసీసీ డాక్టర్ సెల్,తెలంగాణ  ఇన్‌చార్జ్ డా. దిలీప్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ సెల్, నాగర్‌కర్నూల్ జిల్లా జారీ చేశారు.ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి,మరియు డిసిసి అధ్యక్షులు డా. వంశీకృష్ణలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తన నియామకానికి సహకరించిన టిపిసిసి డాక్టర్ సెల్ నాయకత్వానికి, జిల్లా కాంగ్రెస్ నాయకులకు మరియు పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధత, నిజాయితీ, అంకితభావంతో నిర్వర్తిస్తూ, నాగర్‌కర్నూల్ జిల్లాలో డాక్టర్ సెల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది మరియు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.

చెల్లి.. బుజ్జి అంటూ వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు!

ఖమ్మం: కోర్టు కేసు విచారణ నిమిత్తం వచ్చిన ఓ వివాహితను ‘చెల్లి’, ‘బుజ్జి’ అంటూ పరిచయం పెంచుకుని, ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాంబ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విషయంలో కోర్టుకు వస్తున్న సమయంలో...

21 ఏళ్ల తర్వాత.. ‘నా కొడుకు తండ్రివి నువ్వే’ అంటూ ధర్నా

గద్వాల: తన కుమారుడు పుట్టి 21 ఏళ్లు గడిచినా తండ్రిగా అంగీకరించడం లేదంటూ ఓ మహిళ తన కుమారుడితో కలిసి ధర్నాకు దిగిన ఘటన గద్వాలలో కలకలం రేపింది. తన కుమారుడికి తండ్రి అయిన వ్యక్తి ఇప్పటికైనా అతడిని తన కొడుకుగా అంగీకరించాలని కోరుతూ కృష్ణవేణి నిరసన...

కొండా సురేఖ వస్తే బీజేపీలోకి ఆహ్వానం

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అందువల్ల ఆమె బీజేపీలో చేరడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు. కొండా సురేఖ బీజేపీలోకి రావాలనుకుంటే పార్టీ తరఫున స్వాగతం పలుకుతామని...

రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన కాలే యాదయ్య

షాబాద్‌: చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌ మండలం రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను అభినందించారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సొంతింటి కలను సాకారం చేయడమే...

మన నేచురల్ డైరీ ప్రారంభించిన చేవెళ్ల మున్సిపాలిటీ చైర్మన్

చేవెళ్ల మున్సిపాలిటీ, ఆగస్టు 31: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని చేవెళ్ల విలేజ్‌ రోడ్డులో, పోస్ట్‌ ఆఫీస్‌ పక్కన మన నేచురల్‌ డైరీ నూతన షాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ దేవర సమత వెంకట్‌...