మృతుని కుటుంబానికి అండగా జోగయ్య
- చదువుతోనే తలరాత మారుతుంది - August 14, 2026
- రాజ్యాంగాన్ని గౌరవిద్దాం:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - August 14, 2026
- ప్రజావాణికి పకడ్బందీ కార్యాచరణ - August 14, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 14 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన వాన రాసి రాములు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య శుక్రవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు రూ.5000/-వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, వార్డు సభ్యులు సిర్సనగండ్ల శేఖర్,బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళగిరి సత్యం,బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జంగిలి ప్రవీణ్,గోపాల్, బిట్టి సైదులు,వానరాశి రాములు, శివరాజ్, మహేష్, సురేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
