Author: shrikanth nallolla

తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం రెండు డీఏలు విడుదల చేసేందుకు అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. సీఎస్‌ సంజయ్‌ జాజుతో జరిగిన చర్చల్లో మొదటి డీఏను 3.46 శాతం, రెండో డీఏను 2.74 శాతంగా ప్రకటించినట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న...

సీఎంతో TGEJAC నేతల భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) నాయకులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో బుధవారం రాత్రి 9 గంటలకు TGEJAC నేతలు సమావేశం కానున్నారు. ఉద్యోగుల సమస్యలు, పెండింగ్‌ డిమాండ్లు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ...

చెందిప్ప గేట్ హనుమాన్ ఆలయం పరిసరాల్లో రసాయన పౌడర్

చెందిప్ప గేట్ హనుమాన్ ఆలయం పరిసర ప్రాంతాల్లో గుర్తుతెలియని రసాయన పౌడర్‌ను వేస్తున్నారనే ఆరోపణలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ రసాయన పదార్థాలను జంతువులు, పక్షులు పొరపాటున ఆహారంగా భావించి తింటే వాటి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ పరిసరాలు కావడంతో భక్తులు, ప్రజలు, పశువులు, పక్షులు తరచుగా సంచరిస్తుంటారని, ఇలాంటి పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అసలు ఆ పౌడర్ ఏమిటి?…

స్వర్ణ సంచలనం..లంకపై భారత్‌ ఘన విజయం!

జ్ఞానతెలంగాణ,స్పోర్ట్స్ ప్రతినిధి :ఆసియా క్రీడలు–2026 మహిళల క్రికెట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. నిషిన్‌లోని కోరోగీ స్పోర్ట్స్‌ పార్క్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ పోరులో టీమిండియా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా...

రిమ్స్ ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

ఆదిలాబాద్: రిమ్స్‌ నియోనేటల్‌ వార్డులో ఏసీ సిలిండర్‌ పేలిన ఘటనలో శిశువులు మృతి చెందడంపై బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, దీనిపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారుల ప్రాణాలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆదేశాలు ఇవ్వడం కంటే ముందస్తు పర్యవేక్షణ, భద్రతా చర్యలే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో…

భానురులో కులరక్కసి

పటాన్‌చెరు, సెప్టెంబర్ 22: బీడీఎల్‌ భానురు గ్రామంలో దళిత మహిళ గృహ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎస్సీ వర్గానికి చెందిన చేవెళ్ల స్వరూప తన సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుండగా, కొందరు వ్యక్తులు కుల వివక్షతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రి తీసుకువచ్చే ట్రాక్టర్లను సీసీ రోడ్డుపై అడ్డంగా నిలిపి, రాకపోకలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఒక దళిత మహిళ తన సొంత స్థలంలో…

సోనియాకు కోర్టు ఝలక్!

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించిన ఓటర్ల జాబితా వివాదం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది. 1983లో భారత పౌరసత్వం పొందడానికి ముందే 1980లో ఆమె పేరు న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదైందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌లో దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు సోమవారం కీలక...

ప్రెస్ అకాడమీ చైర్మన్‌కు ఘన సత్కారం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21: తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యులు చిలకమర్రి నరసింహ సోమవారం ఘనంగా సత్కరించారు. సెప్టెంబర్‌ 21, 2026న ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కార్యాలయంలో శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో ప్రెస్‌ అకాడమీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పాత్రికేయుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను సమాజం దృష్టికి…

రక్షణ లేని ఆర్టీసీ బస్‌స్టేషన్‌.. దొంగలకు అడ్డాగా వికారాబాద్‌ బస్టాండ్

బస్‌ ఎక్కే క్రమంలో మొబైల్‌ చోరీ- ఏడాదిగా పనిచేయని సీసీ కెమెరాలు- భద్రతపై ప్రయాణికుల ఆందోళన- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు- పటిష్ట భద్రతా చర్యలకు డిమాండ్‌జ్ఞాన తెలంగాణ, వికారాబాద్‌, సెప్టెంబర్‌ 21: వికారాబాద్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో భద్రతా లోపాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోమవారం ఉదయం 10:16 గంటలకు శంకర్‌పల్లి బస్సు ఎక్కుతున్న ఆలంఖన్‌గూడకు చెందిన కైల చుక్కరెడ్డి స్మార్ట్‌ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఘటనపై ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించగా బస్‌స్టేషన్‌లోని సీసీ కెమెరాలు ఏడాది కాలంగా పనిచేయడం…