Author: PAKADI RAMANJANEYULU

అజిలాపూర్ లోని విద్యుత్ సమస్యలపై స్పందనలు

వెల్దండ సెప్టెంబర్ 18:మండలంలోని అజిలాపూర్ గ్రామంలో లోవోల్టేజీ సమస్య కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు డీసీసీ కార్యదర్శి శంకర్ నాయక్,వార్డు సభ్యులు జక్కుల మల్లేష్ యాదవ్,బండోనిపల్లి సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్‌ రెడ్డి స్పందించారు.అవసరమైన గ్రామాలకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు అందించినట్లు…

వెదురుతో ఆర్థిక వనరులకు బాటలు.. అదనపు కలెక్టర్

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18: వెదురు వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్థిక ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య అన్నారు. అంతర్జాతీయ వెదురు దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వెదురుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చన్నారు. వెదురు ఆధారిత పరిశ్రమలు, హస్తకళలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ…

సీఎం ఆర్ఎస్ఎస్ చెక్కు అందజేసిన.. ఎమ్మెల్యే కసిరెడ్డి

వెల్దండ, సెప్టెంబర్ 18:వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన గోరంట్ల మహేష్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) రూ.19,500 చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యం, ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) అండగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా మహేష్‌కు…

ఆపదలో ఆపన్న హస్తం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం – రూ. 20 వేల చెక్కు అందజేసిన సర్పంచ్ కొండల్ యాదవ్

వెల్దండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్ సూచించారు.ఇటీవల నూనె కృష్ణయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద మంజూరు చేసిన రూ.20 వేల ఆర్థిక సాయం చెక్కును మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు సర్పంచ్ కొండలు యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..

గుండాలలో జక్కుల రాములు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

వెల్దండ, సెప్టెంబర్ 18: గుండాల గ్రామ సర్పంచ్ జక్కుల వెంకటయ్య తండ్రి జక్కుల రాములు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జక్కుల రాములు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి, వెల్దండ సర్పంచ్ మట్ట వెంకటయ్య గౌడ్, కంటోన్‌పల్లి సర్పంచ్ లక్ష్మణస్వామి, కాంగ్రెస్ నాయకులు రషీద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మట్ట భరత్…

చౌదర్ పల్లి గణేష్ ఉత్సవాలకు సింగిల్ విండో చైర్మన్ రూ.25 వేల విరాళం

వెల్దండ, సెప్టెంబర్ 18: వెల్దండ మండలం చౌదర్‌పల్లిలో గణేష్ ఉత్సవ కమిటీకి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. గణేష్ మండపంలో మైక్ సెట్ ఏర్పాటు కోసం ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భాస్కరరావు పేర్కొన్నారు. సమాజ మనుగడకు భక్తి, భావనలే ఆధారమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొబ్బల రాజీవ్, వార్డు సభ్యులు భరత్,నరేష్,వంశీ…

బాధిత కుటుంబానికి అంజి మాస్టర్ ఆర్థిక సహాయం

వెల్దండ సెప్టెంబర్ 18: మండల పరిధిలోని పోతెపల్లి గ్రామంలో వావిల్ల వసంత గురువారం ఉదయం మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకొని అంజి మాస్టర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.3 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు .ఈ కార్యక్రమం లో అంజి మాస్టర్,తగుళ్ల చంద్రయ్య, , బోయినిపల్లి నిరంజన్ గౌడ్,చిన్న సైదయ్య, కొమ్ము వెంకటయ్య,కుమ్మరి శ్రీశైలం,రామస్వామి, పార్వతాలు,వార్డు సభ్యులు ఊడతబాలస్వామి,కుమ్మరి శివ, గోరటి అశోక్ కుమార్, పాల్గొన్నారు.

ఎఫ్ పి ఓ తో రైతుల అభివృద్ధికి బాటలు – సింగిల్ విండో చైర్మన్ భాస్కరరావు

వెల్దండ, సెప్టెంబర్ 18: ఉమ్మడి వెల్దండ మండలంలోని సింగిల్ విండో రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో)ను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు కోరారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌పీవోలో 750 మంది రైతులు రూ.2 వేల చొప్పున సభ్యత్వం పొందితే రూ.15 లక్షలు జమ అవుతాయని, కేంద్ర ప్రభుత్వం మరో రూ.15 లక్షలు అందిస్తుందని తెలిపారు. దీంతో సహకార సంఘాలు బలోపేతం కావడంతో పాటు రైతులకు నాణ్యమైన…

హమార ప్రసాద్ ను చేయాలి – వెల్దండ ఎస్సై కి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు

వెల్దండ సెప్టెంబర్ 17:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పిత నాయకుడు అనే పుస్తకాన్ని ఈనెల 18న ఆవిష్కరిస్తానని అమర ప్రసాద్ ప్రకటించడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైనటువంటి ఆరోపణలతో వస్తున్నటువంటి పుస్తక విడుదలను ఆపేసి వెంటనే అమర ప్రసాద్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.ప్రపంచం మొత్తమే గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అని కొనియాడుతున్న వేళ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సరికాదని హెచ్చరించారు.ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసా.. జీ. ఎస్. ఆర్

కల్వకుర్తి సెప్టెంబర్ 17 : కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం ఇస్రాయిపల్లి గ్రామానికి చెందిన రాచాలపల్లి స్వప్న కు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.25,000ల చెక్కును గురువారం కల్వకుర్తిలో వారి కుటుంబ సభ్యులు ముత్యాల నరేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం…