అజిలాపూర్ లోని విద్యుత్ సమస్యలపై స్పందనలు

1001191151.jpg

వెల్దండ సెప్టెంబర్ 18:మండలంలోని అజిలాపూర్ గ్రామంలో లోవోల్టేజీ సమస్య కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు డీసీసీ కార్యదర్శి శంకర్ నాయక్,వార్డు సభ్యులు జక్కుల మల్లేష్ యాదవ్,బండోనిపల్లి సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్‌ రెడ్డి స్పందించారు.అవసరమైన గ్రామాలకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు అందించినట్లు వారు తెలిపారు.గ్రామానికి సంబంధించిన విద్యుత్ తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు.కాగా, అజిలాపూర్‌లోని లోవోల్టేజీ సమస్యను సంబంధిత అధికారులు పరిశీలించి,రైతులు, గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

You may also like...