Author: PAKADI RAMANJANEYULU

పేదల కళ్ళలో వెలుగులు నింపుతున్న మానవతా మూర్తి.. సుంకి రెడ్డి.!

కడ్తాల్, సెప్టెంబర్ 17: కడ్తాల్ గడ్ పై డబ్బులేక కంటి చూపు కోల్పోయి చీకట్లో మగ్గుతున్న పేదలకు దేవుడిలా అండగా నిలుస్తున్నారు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.ఎంబీఏ గార్డెన్స్ లో ప్రపంచ ప్రఖ్యాత శంకర నేత్రాలయ, చెన్నై వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం నేడు 7వ రోజుకు చేరుకుంది.ఈ శిబిరానికి ఇప్పటివరకు 5,500 మందికి పైగా హాజరయ్యారు. అందులో 3,600 మందికి ఉచిత…

తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత కెసిఆర్ దే – గిరిజనుల కృతజ్ఞత

వెల్దండ సెప్టెంబర్ 17: వెల్దండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ తండాలలో గురువారం గిరిజనులు తెలంగాణ జాతిపిత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించి గిరిజన ప్రాంతాలకు స్వపరిపాలన అవకాశం కల్పించిన ఘనత కేసీఆర్ దక్కుతుందని గిరిజనులు అభిప్రాయపడ్డారు. మండలంలోని రాంపూర్ తండా, లక్ష్మానాయక్…

బొల్లంపల్లి లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం – జెండా ఆవిష్కరించిన సర్పంచ్ ప్రసాద్ గౌడ్

వెల్దండ సెప్టెంబర్ 17: వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జాతీయ జెండా ప్రతీకగా నిలుస్తుందని, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రజా పాలన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. గ్రామంలో…

చౌదర్ పల్లిలో ఘనంగా పోషణ మాసం – ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ కృష్ణారెడ్డి

వెల్దండ : వెల్దండ మండలం చౌదర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ రాజీవ్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ చంద్రకళ మాట్లాడుతూ.. పోషకాహారంతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు జయ ,కమల, ఆయా అనంతమ్మ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి పరామర్శ – ఆర్థిక సహాయం అందజేసిన కానుగుల జోగయ్య

వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఉమ్మనమైన యాదమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతురాలికి పూలమాలతో నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం రూ.5000 రూపాయలను అందజేశారు. కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు నిరంజన్, లింగం, వార్డు సభ్యులు…

మృతురాలి కుటుంబానికి పరామర్శ – రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి కొండల్ యాదవ్

వెల్దండ సెప్టెంబర్ :వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన వసంత (40) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.3 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.అదైర్య పడకూడదు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎగిరి శెట్టి పద్మ శివకుమార్, ఆంజనేయులు, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

వెల్దండ సింగిల్ విండో కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ: రాజేందర్ రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 17:తెలంగాణ విమోచన దినం సందర్భంగా వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) కార్యాలయంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పంతు నాయక్,సీఈఓ…

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత – కానుగుల జోగయ్య

వెల్దండ, సెప్టెంబర్ 16 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించి, కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింగం, మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ సర్పంచ్ గుద్దేటి ప్రభాకర్, వార్డు…

పోతేపల్లి గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సర్పంచ్ కొండల్ యాదవ్ రూ. 10 వేల విరాళం

వెల్దండ సెప్టెంబర్ 16: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారంగా మండప నిర్వాహకులకు రూ.10,000/- చందాను సర్పంచ్ కొండల్ యాదవ్ అందజేశారు.గ్రామంలో పండుగలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజలందరూ ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.యువత ముందుండి నిర్వహించే ఆజాద్ యూత్ వంటి యువజన సంఘాల కార్యక్రమాలకు అండగా ఉంటామని తెలిపారు.ఈ సందర్భంగా మండప నిర్వాహకులు, ఆజాద్ యూత్ సభ్యులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పోతేపల్లి గ్రామ…

పర్యవేక్షక ఇంజనీర్ నరసింహారెడ్డిని కలిసిన పుట్ట రాంరెడ్డి

నాగర్ కర్నూల్ / వెల్దండ 16: నాగర్ కర్నూల్ జిల్లా విద్యుత్ పర్యవేక్షక ఇంజనీర్ (SE) నరసింహారెడ్డిని వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుట్టా రాంరెడ్డి బుధవారం నాగర్ కర్నూల్ విద్యుత్ కార్యాలయంలో బొల్లంపల్లి గ్రామ రైతులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలంలో విద్యుత్ సరఫరాలో కోతలు విధించకుండా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని పర్యవేక్షక ఇంజనీర్ ని కోరారు.కొన్ని మరమ్మతుల కారణంగా అంతరాయం ఏర్పడుతున్న మాట వాస్తవమేనని, రైతులకు సరిపడా విద్యుత్…