Author: PAKADI RAMANJANEYULU
వంగూరు: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ జిలకర కాశమ్మ ఎమ్మెల్యే వంశీకృష్ణపై తీవ్ర ఆరోపణలు చేశారు. సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామ అభివృద్ధి కోసం కొత్త మోటార్లు, వీధి దీపాలు తదితర పనులు చేయించానని, ఇందుకోసం తన బంగారు పుస్తెలతాడు, ఉంగరాలను తాకట్టు పెట్టి సొంత డబ్బులు ఖర్చు చేశానని తెలిపారు.గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలు, ఎంబీ రికార్డులు తీసుకుని తాను ఖర్చు చేసిన నగదును తిరిగి పొందేందుకు ప్రయత్నించగా గ్రామ…
వెల్దండ: తండ్రి చిన్నతనంలోనే దూరమైనా.. తల్లి కూలి పనులు చేస్తూ చదివించినా.. పేదరికాన్ని అధిగమించి వైద్య విద్యలో సీటు సాధించిన సురితకు ఇప్పుడు దాతల చేయూత అవసరమైంది.చదువులో ప్రతిభ కనబరిచిన సురిత పదో తరగతిలో 10/10 గ్రేడ్, ఇంటర్లో 90 శాతం మార్కులు సాధించింది. నీట్లో 432 మార్కులు సాధించి ఎస్సీ కోటాలో 608వ ర్యాంకు పొందింది.కౌన్సెలింగ్లో మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకుంది.తండ్రి 2018లో మృతి చెందడంతో తల్లి కూలి పనులు చేస్తూ…
వెల్దండ: బీహార్కు చెందిన గౌతమ్ సింగ్, సావిత్రి దేవి దంపతులు గత 8 నెలలుగా వెల్దండ మండలం కొట్ర తండాకు చెందిన నేనావత్ సోములు ఆవుల షెడ్డులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం.వారి పెద్ద కుమారుడు ఆర్యన్ (8) కొట్ర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వారు నివసిస్తున్న ఇంటి వద్ద నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు.బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే…
నాగర్ కర్నూల్:బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధానిత శాఖలు, కరెన్సీ చెస్టులు ఆదివారం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగుల అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. వివిధ శాఖల్లో విశిష్ట సేవలందించిన ఉద్యోగులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వివరాలకు జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
వెల్దండ: 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దండలోని ఆయుర్వేద వైద్యశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.వైద్య శిబిరంలో చిన్న పిల్లలకు మరియు వృద్దులకు ప్రత్యేక చొరవతో మందులు పంపిణీ చేశారు.ఇందులో 150 మందికి ఉచిత మందులు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ జె. చంద్రసింగ్, డాక్టర్ సింధు మురళి, యోగా శిక్షకులు బీరయ్య, మల్లయ్య,…
వెల్దండ మండలం: నగరగడ్డ తండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి బోలిగుట్ట తండాకు చెందిన చెదురుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ వడ్త్యవత్ ధన్ సింగ్ రూ.10 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందించిన ధన్ సింగ్ను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో రాత్లావత్ వస్య, లాలు, మణిపాల్, శ్రీను, నరేష్, గోపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్సుల వ్యవహారంపై ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్య సేవల పేరుతో ఆసుపత్రి పరిసరాల్లో ప్రైవేట్ అంబులెన్సులు నిలిపి ఉంచి, హైదరాబాద్కు తరలించే రోగుల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని అంబులెన్సుల్లో కనీస అత్యవసర వైద్య…
వెల్దండ: మండల కేంద్రానికి చెందిన దండుగుల నారయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ బుధవారం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో కొయ్యల పుల్లయ్య, మారేపల్లి శ్రీనివాస్, మట్ట భరత్, రేవల్లి దర్గయ్య, రేవల్లి బాలరాజు, కనుగుల వెంకటయ్య, మట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో అండగా.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసావెల్దండ, సెప్టెంబర్ 23: మండల కేంద్రానికి చెందిన దండుగుల నారయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల కన్యాకుమారి జోగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, మాజీ సర్పంచ్ గుద్దేటి ప్రభాకర్,…