జూరాలకు కృష్ణమ్మ జలాలు.. రైతులకు కాంగ్రెస్ భరోసా – కాయితి విజయ్ కుమార్ రెడ్డి
- విషాదం.. ఆర్యన్ మృతదేహం లభ్యం - September 24, 2026
- జూరాలకు కృష్ణమ్మ జలాలు.. రైతులకు కాంగ్రెస్ భరోసా – కాయితి విజయ్ కుమార్ రెడ్డి - September 24, 2026
- విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఏపీకి సర్పంచ్ వినతిపత్రం అందజేత - September 24, 2026
కల్వకుర్తి: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడం పట్ల కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో పాలమూరు రైతులకు సాగునీటి భరోసా కలుగుతుందని తెలిపారు.రైతుల పంటలు ఎండిపోకుండా తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు కర్ణాటక ప్రభుత్వంతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వడం రైతులకు ఊరటనిచ్చే అంశమన్నారు. జూరాల ఆయకట్టు రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
