విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఏపీకి సర్పంచ్ వినతిపత్రం అందజేత
- చల్లపల్లి గణేశుడు లడ్డుకి భారీ డిమాండ్ రూ. 39500 లకు సొంతం చేసుకున్న.. కృష్ణయ్య - September 24, 2026
- విషాదం.. ఆర్యన్ మృతదేహం లభ్యం - September 24, 2026
- జూరాలకు కృష్ణమ్మ జలాలు.. రైతులకు కాంగ్రెస్ భరోసా – కాయితి విజయ్ కుమార్ రెడ్డి - September 24, 2026

వెల్దండ: అజిలాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం వెల్దండ విద్యుత్ శాఖ ఏఈని కలిసి వినతిపత్రం అందజేశారు.గ్రామానికి రెండు 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, 20 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో నిరంతరం విద్యుత్ దీపాలు వెలిగే సమస్యను నివారించేందుకు థర్డ్ వైరు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాడుగుల మండలం ఇరువై గ్రామపంచాయతీ, వెల్దండ మండలం బైరాపూర్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని, బైరాపూర్ నుంచి అజిలాపూర్కు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సర్పంచ్ వినతిపై స్పందించిన ఏఈ, త్వరలోనే గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
