నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డికి ఘన సన్మానం
- నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డికి ఘన సన్మానం - September 24, 2026
- గ్రామ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ - September 24, 2026
- ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదన కలెక్టర్ – బి చెన్నయ్య - September 24, 2026

అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అడాపల గోపాల్ రెడ్డిని పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.రైతులకు అండదండగా ఉంటూ వారి సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేసి, మార్కెట్ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అడపాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల మేలు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట డివిజన్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పాత్కుల శ్రీశైలం, అంబేద్కర్ సంఘం రాష్ట్ర సహయకార్యదర్శి జక్క బాలకిష్టయ్య,, రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు విజయ్ మోహన్, గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు చెవ్వ పాండు, ఫ్రీడమ్ ఫైటర్ టీజేఏసీ శ్రీనివాస్, టీపీఎఫ్ నేత నగేష్ పాల్గొని నూతన చైర్మన్‌కు అభినందనలు తెలిపారు.
