ప్రజా పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఎంపీ మల్లు రవి
- భక్తితో నిమజ్జనం.. జాగ్రత్తగా గణేశుడికి వీడ్కోలు పలుకుదాం – రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ - September 25, 2026
- ప్రజా పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఎంపీ మల్లు రవి - September 25, 2026
- చలో జాజాల.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక - September 25, 2026
నాగర్ కర్నూల్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్‌కర్నూల్ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి హర్షం వ్యక్తం చేశారు.కేరళలో ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి ప్రజల గౌరవాన్ని పొందిన ఆర్య దాస్ మహమ్మద్ పేరుతో అందజేసిన ఈ పురస్కారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాసేవకు లభించిన ప్రత్యేక గౌరవమని మల్లు రవి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు.ఈ పురస్కారం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ అవార్డు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మరింత ప్రేరణనిస్తుందని మల్లు రవి ఆశాభావం వ్యక్తం చేశారు.
