Author: PAKADI RAMANJANEYULU
వెల్దండ: ప్రజలకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలలో 90% త్రాగునీరు కలుషితం ద్వారానే అభివృద్ధి సంక్రమిస్తున్నాయని విషయాన్ని ఇప్పటివరకు నిర్వహించిన వైద్య శిబిరాల వరకు వైద్యులు వెల్లడించారని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నీటి శుద్ధి చేస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగానే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అందులో భాగంగానే మండలంలోని అజిలాపూర్ గ్రామంలో సోమవారం ఐదు ట్యాంకులను శుద్ధి చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అజిలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్…
కల్వకుర్తి: పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, కాంస్య విగ్రహ ఏర్పాటు, అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశాలపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ మబ్బు రామరాజు తెలిపారు.సెప్టెంబర్ 30న ఉదయం 10:30 గంటలకు కల్వకుర్తి యూటీఎఫ్ భవనంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా, కుల, ఉద్యోగ, మైనారిటీ, విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని…
వెల్దండ:కొట్ర గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన కొప్పు మాధవులు కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. మాధవులకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో వారి భవిష్యత్తు కోసం గ్రామస్తులందరూ కలిసి రూ.57 వేల నగదును సమకూర్చారు. ఈ మొత్తాన్ని ఆయన భార్య చైతన్య పేరుతో పోస్టాఫీసులో స్థిర నిక్షేపం చేశారు.ఈ సందర్భంగా మాధవులు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన గ్రామస్తులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి. మహేష్,9వ వార్డు సభ్యుడు కొప్పు మల్లేష్, ఎమ్మార్పీఎస్ గ్రామ…
నాగర్ కర్నూల్: కృష్ణ జింకల అక్రమ వేటకు సంబంధించిన కేసును షాద్‌నగర్ పోలీసులు,అటవీశాఖ అధికారులు కలిసి ఛేదించారు.ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సి.సిరిషా రాఘవేంద్ర, ఆర్ఆర్ జిల్లా డీఎఫ్ఓ శివ ఆశీష్ సింగ్ వెల్లడించారు. సెప్టెంబర్ 26న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని,అతని సమాచారం మేరకు మిగతా నిందితులను సెప్టెంబర్ 27న పట్టుకున్నట్లు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణజింకలను వేటాడేందుకు నిందితులు ఆయుధాన్ని ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి ఒక…
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 51 దరఖాస్తులు అందాయి. అదనపు కలెక్టర్ దేవ సహయం, ఏఓ చంద్రశేఖర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు తమ దరఖాస్తులను అధికారులకు అందజేశారు. సమస్యలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.
తలకొండపల్లి మండలం విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సెప్టెంబర్ 29న ఉదయం 11:45 నిమిషాలకు దేవకి గార్డెన్ లో నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమానికి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించనున్నారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు,విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,విద్యాభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వెల్దండ సెప్టెంబర్ 28: వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక్క ఫిర్యాదు అందినట్లు ఎంపీడీవో సులోచన తెలిపారు.మండల కేంద్రం నుండి రాచూర్ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణాని కై పలుమార్లు అధికారులకు దరఖాస్తులు అందజేసి పాదయాత్రలు చేపట్టిన రోడ్డు పనులు చేపట్టకపోవడం బాధాకరమంటూ వినతిలో పేర్కొన్నట్టు వార్డు సభ్యులు సురేష్ రెడ్డి, కొంగళ్ళ స్వాతి శివశంకర్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను తీసుకోకుండా తిప్పి పంపుతున్నారని…
నాగర్ కర్నూల్: కల్వకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,వాకిటి శ్రీహరి,జూపల్లి కృష్ణారావుల సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర ముఖ్యమైన అంశాలపై నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల…
వెల్దండ,సెప్టెంబర్ 28: ఆంధ్రజ్యోతి రిపోర్టర్ యెన్నం పురుషోత్తం రెడ్డి తన కలంతోనే కాకుండా కుంచెతోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆయన వేసిన ఈ ఆయిల్ పెయింటింగ్ లో గ్రామీణ మహిళ సాంప్రదాయ వేషధారణలో, నీలం రంగు చీర, పసుపు రంగు ఓణీతో ఎంతో సహజంగా కనిపిస్తుంది. ముఖంలో భావం, చేతులకు తెల్ల గాజులు,మెడలో ముత్యాల హారం చిత్రానికి మరింత అందాన్ని తెచ్చాయి.వృత్తిలో జర్నలిస్టుగా ఉంటూనే, ప్రవృత్తిగా చిత్ర లేఖనంలోనూ తనకున్న ఆసక్తిని ఇలా చిత్రాల రూపంలో ఆవిష్కరిస్తున్నారని…
కల్వకుర్తి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కల్వకుర్తి నగర కమిటీని జిల్లా కన్వీనర్ మొక్తల శాంతన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.నగర కార్యదర్శిగా వసంత చరణ్ యాదవ్, సంయుక్త కార్యదర్శులుగా వేముగంటి శివరాం, భరద్వాజ్ ఎన్నికయ్యారు. ఎస్ఎఫ్డీ కన్వీనర్‌గా ఎం.రామ్‌చరణ్, కో-కన్వీనర్‌గా శివచరణ్; ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్‌గా శివ, కో-కన్వీనర్‌గా పవన్చారి; సోషల్ మీడియా కన్వీనర్‌గా శివ, కో-కన్వీనర్‌గా గౌతమ్ ఎంపికయ్యారు.అలాగే క్రీడా భారత్ కన్వీనర్‌గా రవీందర్, కళామంచ్ కన్వీనర్‌గా రాకేష్, కో-కన్వీనర్‌గా…