తిరుమల్ నగర్ కాలనీలో ఉన్న డ్రైనేజ్ ను పరిశీలించిన

డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రాఘవేంద్ర రెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో
బడంగ్పేట్ మున్సిపాలిటీలో గల 26వ డివిజన్ కు సంబంధించి న్యూ తిరుమల్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసుల సమస్యలను
రాఘవేంద్ర రెడ్డి కాలనీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అందరూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందున ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవేంద్ర రెడ్డి,
దృష్టికి కాలాని వాసులందరూ కలిసి తీసుకురావడంతో
ఇట్టి సంబంధించిన డ్రైనేజీ సమస్యను
కాలని వాసులతో కలిసి పర్యటించి అతి త్వరలో మన బడంగ్పేట్ మున్సిపల్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి
దృష్టికి తీసుకెళ్లి సమస్యను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని రాఘవేందర్ రెడ్డి అన్నారు.

You may also like...

Translate »