డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పై వర్థన్న పేట ఎంఎల్ఏ నాగరాజు చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని వెంటనే బహిరంగంగా క్షేమాపన చెప్పాలి

Oplus_0

డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పై వర్థన్న పేట ఎంఎల్ఏ నాగరాజు చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని వెంటనే బహిరంగంగా క్షేమాపన చెప్పాలి
మంద శ్యామ్ – స్వెరోస్ మాజి – స్టేట్ ప్రెసిడెంట్ & బి.ఆర్.స్ నాయకులు

వరంగల్ జ్ఞాన తెలంగాణ భారత రాష్ట్ర సమితి నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని మరియు స్వేరోస్ సంస్థను గూండాలుగా రౌడీలుగా వక్రీకరిస్తూ మరియు మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఆత్మ ధైర్యంతో సమాజం మేలు కోసం జ్ఞాన శ్రేయస్ కోసం ఎందరో జీవితాలలో వెలుగు నింపిన నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని స్థాయి మరియు హోదా మరిచి మాట్లాడిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దిష్టిబొమ్మని ఈరోజు ఐనవోలు మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి నాయకుల ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది ప్రజా నాయకులు ప్రజలను పరిపాలించే ఆలోచనలో ఉండాలని ప్రజా శ్రేయస్సు మరిచి ప్రజల వైపున్న నాయకుడిని ప్రజా జ్ఞాన శ్రేయస్సు కొరె స్వేరోస్ నెట్వర్క్ పై అనుచితంగా మాట్లాడిన నాగరాజు తక్షణమే ప్రజా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగం పక్కనపెట్టి రాజకీయాలకు రాగానే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడే మాటలు మానుకోవాలని రౌడీలు గుండాలు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ విజ్ఞానవంతులను మేధావులను మరియు సైంటిస్టులను విద్యార్థి నాయకులను తయారుచేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కె ఆర్ నాగరాజు పై మండిపడ్డారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా డాక్టర్లను వేలాదిమంది ఇంజనీర్లను వందల సంఖ్యల్లో లిటిల్ సైంటిస్ట్ గా వేల మంది విద్యార్థులు వివిధ అంతరాష్ట్ర మరియు అంతర్జాతీయ యూనివర్సిటీలో చదువుతూ పూరి గుడిసె నుండి పూణే యూనివర్సిటీ వరకు తీసుకు వెళ్లిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిదని మరియు స్వేరోస్ నెట్వర్క్ లక్ష్యంగా తీసుకున్న చారిత్రాత్మక విజయాలలో రూపు పొందిందని తెలియజేశారు కావున తక్షణమే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ బహిరంగ క్షమాపణ చెబుతూ స్వేరోస్ విజయాలను కేఆర్ నాగరాజు స్వయంగా ప్రజలకు తెలియజేయాలని మండిపడ్డారు
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు&నాయకులు కుమార్ జనరల్ సెక్రెటరీ అశోక్, బీసీ సెల్ అధ్యక్షుడు వంశి, యూత్ అధ్యక్షుడు చెందు, జన్ను జయరాజ్, మహేష్,రాజు,వెంకట్ రమణ, నాగరాజు, వెంకట్ స్వామి, చక్రి,శెనిగరపు శ్రీనివాస్, మనోజ్,కుమార్,ప్రసాద్,సిద్దు,b. ఆర్ ఎస్ మరియు స్వేరో నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »