రేపు అచ్చంపేటలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ
- వడ్ల దొంగల ముఠా అరెస్ట్ - November 25, 2026
- హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత - November 25, 2026
- దిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురిపై కేసు - November 25, 2026

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ప్రముఖ మద్దిమడుగు ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభ నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో అచ్చంపేట ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత లభించనుందని స్థానికంగా భావిస్తున్నారు.
