విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప

WhatsApp Image 2026-11-21 at 20.01.29.jpeg

విద్యార్థులు చిన్న వయస్సు నుంచే భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, విధులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జనగామ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప సూచించారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ DLSA ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని ఏకశిలా పబ్లిక్ స్కూల్, వైష్ణవి హైస్కూల్‌లలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి కె. సందీప మాట్లాడుతూ బాలల హక్కులు, మహిళల రక్షణ చట్టాలు, విద్యా హక్కు

సమాజంలో న్యాయం,సమానత్వం వంటి అంశాలపై ప్రతి విద్యార్థి అవగాహన.పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత అలవర్చుకోవాలని సూచించారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవల ప్రాధాన్యతను వివరించారు.ఏకశిలా పబ్లిక్ స్కూల్‌లో చిర్ర ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన, వైష్ణవి హైస్కూల్‌లో విజయశ్రీ అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండు పాఠశాలల్లో కలిపి సుమారు 1,100 మంది విద్యార్థులు పాల్గొని న్యాయపరమైన అంశాలపై అవగాహన పొందారు.కార్యక్రమాల్లో DLSA సిబ్బంది, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like...