పలు శుభకార్యాలలో పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రామన్న

1001381770.jpg

కల్వకుర్తి నవంబర్ 20: మండలంలోని జూపల్లి గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ జగపతి, సీనియర్ నాయకుడు బొజ్జయ్య, రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీనునాయక్, భాస్కర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

వివాహ, నామకరణ వేడుకల్లో పాపిశెట్టి రాము

కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్, ఖానాపూర్, విటాయిపల్లి, కోనాపూర్, కడ్తాల్, చుక్కాపూర్, తుక్కుగూడ గ్రామాల్లో నిర్వహించిన వివాహ, నామకరణ వేడుకల్లో ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి శ్రీనిక ఆధ్య నామకరణ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. ఆయన వెంట రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీనునాయక్, రాకేష్ తదితరులు ఉన్నారు.

You may also like...