నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. వెల్దండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం

1001381343.jpg

జ్ఞాన తెలంగాణ, వెల్దండ:నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వెల్దండ మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ లబ్ధిదారులకు బీమా పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆపద సమయంలో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ పథకం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి గిరి, వార్డు సభ్యులు ముదికొండ కవిత రమేష్, మంజుల శ్రీనివాస్, వెంకటేష్, దేవేందర్, శేఖర్, బొక్కల శ్రీనివాస్, మట్ట భరత్ గౌడ్, ఈదులపల్లి ఆనంద్, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

You may also like...