రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కామారెడ్డి పట్టణంలోని 38వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్లు గిరి, శ్రీధర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్, సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పండ్ల రాజు, రాజేశ్వర్, గొనె శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మహిళలు, వార్డు ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.