ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు.. నిరుపేద ఆడపడుచు పెళ్లికి రూ.10 వేల కానుక!
- ఆహార శుద్ధి కర్మాగారానికి భూమిపూజ.. ముఖ్యఅతిథిగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి - November 20, 2026
- పలు శుభకార్యాలలో పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రామన్న - November 20, 2026
- నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. వెల్దండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం - November 20, 2026

తలకొండపల్లి, నవంబర్ 20: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపడుచు వివాహానికి రూ.10 వేల ఆర్థిక కానుక అందజేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రెండో పథకం ఆడపడుచు పెళ్లి కానుకలో భాగంగా గురువారం రాంపూర్ గ్రామానికి చెందిన అల్వాల ఈశ్వరమ్మ యాదయ్య గౌడ్ దంపతుల కుమార్తె అనూష వివాహం సందర్భంగా సర్పంచ్ రూ.10 వేల నగదును అందజేసి నూతన వధువును ఆశీర్వదించారు.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీని అమలు చేయడంపై గ్రామస్తులు సర్పంచ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమమ్మ యాదయ్య,మాజీ సర్పంచ్ మణెమ్మ యాదయ్య, మాజీ టెంపుల్ చైర్మన్ సప్పిడి జానయ్య, చెరువు జనరల్ సెక్రటరీ చిలుకం శేఖర్,వార్డు సభ్యులు,మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
