పార్టీ కోసం శ్రమించిన పర్వత్ రెడ్డికే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలి.!

1001373335.jpg

వెల్దండ,నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్న సీనియర్ నాయకులు మల్లేపల్లి పర్వత్ రెడ్డికి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్నారు.పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయడంతో పాటు కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న పర్వత్ రెడ్డికి రైతుల సమస్యలపై కూడా పూర్తి అవగాహన ఉందని వారు పేర్కొంటున్నారు.స్వయంగా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిగా రైతుల కష్టాలు, వ్యవసాయ రంగ సమస్యలపై అవగాహన కలిగిన ఆయనకు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో పర్వత్ రెడ్డికి ఈ పదవి కేటాయించాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

You may also like...