జూపల్లి గ్రామపంచాయతీ నూతన కార్యదర్శికి ఘన స్వాగతం

చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీకి నూతనంగా నియమితులైన గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ ఇస్లావత్ వినోద్ గారు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ డైనమిక్ లీడర్, యువ నాయకుడు సీమర్ల సత్యం యాదవ్, యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్, జూపల్లి భాస్కర్ రావు తదితరులు నూతన కార్యదర్శిని శాలువాతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.1001386093.jpg

అనంతరం వారు మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, పారిశుధ్య నిర్వహణ మరియు మౌలిక వసతుల కల్పనలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ జూపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ప్రజలతో కలిసి, ప్రజల కోసం జూపల్లి గ్రామ అభివృద్ధికి ఐక్యంగా ముందుకు సాగుదామని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

You may also like...