ఆపదలో అండగా పోచారం భాస్కర్ రెడ్డి
- ఆపదలో అండగా పోచారం భాస్కర్ రెడ్డి - October 6, 2026
- KGBV బాలికలకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ - September 30, 2026
- అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి అండగా పోచారం భాస్కర్ రెడ్డి - September 30, 2026
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలువురు ఆత్మీయులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా తండ్రి పాషా బాయి, ఇబ్రహీంపేట్‌కు చెందిన నగేష్ రెడ్డి మనవడు, చిన్నరాంపూర్ మాజీ ఉపసర్పంచ్ అజీమ్ తల్లి జుబేదా బేగం మృతికి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చందూర్ సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్ తల్లి ప్యారం లక్ష్మి మృతికి సంతాపం తెలిపారు. అలాగే దోమలెడ్గి సర్పంచ్ దేవిక శ్రీధర్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ అనంత విఠల్ అనారోగ్యంతో చికిత్స అనంతరం ఇంటికి చేరుకోవడంతో వారి నివాసాలకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
