గాంధీభవన్‌కు తరలిన జనగామ సేవాదళ్ నాయకులు

ఓటు చోరీ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం (CEC) చైర్మన్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా జనగామ జిల్లా సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు సోమవారం పెద్ద ఎత్తున తరలివెళ్లారు.TPCC కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సేవాదళ్ ఐక్యంగా పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు.

You may also like...