బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
- బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ - October 5, 2026
- మదనపల్లెలో రూ.లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన. - October 4, 2026
- వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. - October 4, 2026

రాజేంద్రనగర్: భూగర్భ జలాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బుద్వేల్ జెడ్.పి.హెచ్.ఎస్ (ZPHS) ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 'రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్' (ఇంకుడు గుంత)ను ఎమ్మెల్యే శ్రీ టి. ప్రకాష్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఆధ్వర్యంలో జల సంరక్షణను పెంపొందించే లక్ష్యంతో ఈ హార్వెస్టింగ్ పిట్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని, భూగర్భ జలాల పెంపకానికి సహకరించాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు HMWSSB ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
