బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా మణిందర్‌కు పురస్కారం

వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో మోమిన్ పేట్ మండలం కు చెందిన ఫొటోగ్రాఫర్‌ మణిందర్‌ జిల్లా స్థాయిలో ఉత్తమ వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా పురస్కారం అందుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను  శంషాబాద్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శుక్ర ,శనివారo నిర్వహించిన ఎక్స్‌పో భారత్‌ కళా పురస్కార్‌ అవార్డుల వేడుకలలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.   జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన మణిందర్‌ను పలువురు అభినందించారు.

You may also like...