ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత
- మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పర్వేద వార్డు మెంబర్ రవి - August 21, 2026
- ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత - August 21, 2026
- మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - August 21, 2026

దక్షిణాది చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఇటీవల కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచారు.
షావుకారు జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 400కు పైగా చిత్రాల్లో నటించారు. ‘షావుకారు’, ‘కన్యాశుల్కం’, ‘బడిపంతులు’, ‘సంసారం ఒక చదరంగం’ వంటి చిత్రాలు ఆమెకు విశేష గుర్తింపు తెచ్చాయి. 2022లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం ఆమె సేవలను గౌరవించింది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
