మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి
- మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పర్వేద వార్డు మెంబర్ రవి - August 21, 2026
- ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత - August 21, 2026
- మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - August 21, 2026

శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు, మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ జన్మదిన వేడుకలు చేవెళ్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొల్లారం వెంకట్‌రెడ్డి, కాలే శ్రీకాంత్‌కు పూలమాల వేసి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బొల్లారం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, కాలే శ్రీకాంత్ ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, యువతకు అందుబాటులో ఉండే నాయకుడిగా మంచి గుర్తింపు పొందుతున్నారని అన్నారు. ఆయనకు ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
కాలే శ్రీకాంత్ జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా ఫామ్‌హౌస్‌లో సందడి వాతావరణం నెలకొంది.

