మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పర్వేద వార్డు మెంబర్ రవి

శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు, మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వేద గ్రామ వార్డు మెంబర్ రవీందర్ హాజరై కాలే శ్రీకాంత్‌కు పూలగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ, కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు.
కాలే శ్రీకాంత్ యువతకు ఆదర్శంగా నిలుస్తూ, ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారని రవీందర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో తనదైన ముద్ర వేయాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, శ్రీకాంత్ అభిమానులు తదితరులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

You may also like...