ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు.. నిరుపేద ఆడపడుచు పెళ్లికి రూ.10 వేల కానుక!
తలకొండపల్లి, నవంబర్ 20: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపడుచు వివాహానికి రూ.10 వేల ఆర్థిక కానుక అందజేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రెండో పథకం ఆడపడుచు పెళ్లి కానుకలో భాగంగా గురువారం రాంపూర్ గ్రామానికి చెందిన అల్వాల ఈశ్వరమ్మ యాదయ్య గౌడ్ దంపతుల కుమార్తె అనూష వివాహం సందర్భంగా సర్పంచ్ రూ.10 వేల నగదును అందజేసి నూతన వధువును ఆశీర్వదించారు.ఎన్నికల్లో…
