ఆర్టీసీ సంక్షేమం మా ప్రభుత్వ ధ్యేయం పొన్నం ప్రభాకర్

నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న స్వర్గీయ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది.
ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కుటుంబానికి పరిహారం అందించాం. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించి దాదాపు రూ.కోటి ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి అండగా నిలిచారు.
ఇచ్చిన హామీ మేరకు శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో రికార్డ్ ట్రేసర్ గా ఉద్యోగ నియామక పత్రాన్ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారితో కలిసి అందజేశాను.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ బాధ్యత. ఉద్యోగులను కాపాడుకోవడం సమాజం బాధ్యత.
ఆర్టీసీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. భౌతిక దాడులకు పాల్పడకూడదు.
ఉద్యోగులపై దాడులు చేస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్రయాణికులు మర్చిపోయిన విలువైన వస్తువులను నిజాయితీగా తిరిగి అప్పగిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు ఎందరో ఉన్నారు. వారి సేవలను గుర్తించాలి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నాం.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు, బస్టాండ్ల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నాం.
ఏ గ్రామానికైనా బస్సు సౌకర్యం అవసరమైతే స్థానిక ఆర్టీసీ అధికారులను సంప్రదించాలి. రూట్ వెరిఫికేషన్, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం బస్సు సౌకర్యం కల్పిస్తాం.
బాధిత కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా బాధ్యత. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం.

You may also like...