ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ అంతరాయం

వాజేడు: చీకుపల్లి సమీపంలో ధర్మవరం 33 కేవీ విద్యుత్ లైన్ రోడ్డు క్రాసింగ్, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో గురువారం (12-11-2026) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
అంతరాయం కలిగే సమయంలో రైతులకు నిలిచిపోయిన మూడు ఫేజ్‌ల విద్యుత్‌ను రాత్రి సమయంలో తిరిగి సరఫరా చేయనున్నట్లు వాజేడు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.

You may also like...