ములుగులో దివ్యాంగురాలిపై అఘాయిత్యం
- ఏటూరునాగారంలో అభివృద్ధి పనులు ప్రారంభం - November 12, 2026
- చిన్నారులకు ఐరన్ సిరప్ పంపిణీ చేసిన సర్పంచ్ శ్రీలత - November 12, 2026
- ధర్మవరం సబ్స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ అంతరాయం - November 12, 2026
ములుగు: ములుగు జిల్లాలో ఓ దివ్యాంగ మహిళపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం ఇంట్లో ఉన్న రూ.4 వేల నగదును కూడా నిందితుడు అపహరించినట్లు తెలిపారు. బాధితురాలి గుర్తింపు, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై వెంకటేశ్ వెల్లడించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
