సీఎంఆర్ఎఫ్తో పేద కుటుంబానికి అండ.. గోలి చొరవతో రూ.18 వేల సాయం
- నీటిపారుదల డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు – రూ.100 కోట్ల అక్రమాస్తులు.! - November 12, 2026
- మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు -మాట నిలబెట్టుకున్న సుంకిరెడ్డి.! - November 12, 2026
- సర్పంచులకు ఓటు హక్కు ఇవ్వండి.! ప్రభుత్వానికి పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య వినతి..! - November 12, 2026

కల్వకుర్తి నవంబర్ 12: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో తోడ్పాటునందిస్తోందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన ప్రభాతి రామస్వామికి అనారోగ్య చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.18 వేల చెక్కును గురువారం అందజేశారు. గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఈ ఆర్థిక సాయం మంజూరైంది.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, వెల్దండ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు నాగులు నాయక్, లింగం, రాములు, ఎల్లికల్ సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు సునీత, ఆనంద్, నరేష్, తలకొండపల్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు రమేష్, ప్రవీణ్, రవి, సుమన్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
