Daily Archive: October 24, 2026
వెల్దండ అక్టోబర్ 24 :బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బీఆర్ఎస్వీ వెల్దండ మండల అధ్యక్షుడు నాగిళ్ల శివరాజ్ శనివారం తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించినట్లు నాగిళ్ల శివరాజ్ తెలిపారు.
వెల్దండ: మండలంలో ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన సదస్సును నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యుడు దొబ్బల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పుట్ట రాంరెడ్డి మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నిరంజన్, అశోక్, శేఖర్‌తో పాటు ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ సభ్యులు బండగల్ల చందు, కొమ్ము…
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన చాకలి గుమ్మడి కాశీరాం (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పాత చెరువు తూము వద్ద అతడి మృతదేహాన్ని రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామ సర్పంచ్ ఆశగోని లావణ్య వెంకట్ గౌడ్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కాశీరాం మృతికి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…