రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి సాయం


రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి



కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు12, జెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమల్లి గుట్ట తండాకు చెందిన కెలావత్ శ్రీను ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుని పరామర్శించారు. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు జోగయ్య, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, మాజీ సర్పంచ్ అంజి నాయక్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నగేష్, సీనియర్ నాయకులు ప్రసాద్, జెపల్లి గ్రామ వార్డు సభ్యులు గోపాల్ నాయక్, నాయకులు తరుణ్, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

You may also like...