కీసర పోలీసుల చొరవతో తప్పిపోయిన మైనర్ బాలిక సురక్షితం

కీసర,  కీసరగుట్టకు వచ్చిన 15 ఏళ్ల బుసా లాస్య తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన కీసర పోలీసులు, బందోబస్తు సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. బాలిక ఫొటో, వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పంపడంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రకటనలు, వాహనాల తనిఖీలు నిర్వహించారు. సమన్వయంతో చేపట్టిన చర్యల ఫలితంగా కీసర వాణి పార్కింగ్ ప్రాంతంలో బాలికను సురక్షితంగా గుర్తించారు. అనంతరం గుర్తింపును నిర్ధారించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల తక్షణ స్పందనపై పలువురు అభినందనలు…