అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
- KGBV SOలు, CRTలకు సెలవుల వెసులుబాటు - August 12, 2026
- ఎయిడ్స్‌పై అవగాహనకు భారీ ర్యాలీ - August 12, 2026
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు మధ్యంతర స్టే - August 12, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి పట్టణంలోని తిరుపతి బైపాస్ వద్ద బుధవారం మధ్యాహ్నం లింగసానిపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పెట్టుకున్నట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. అనంతరం రెండు ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, అక్రమంగా తరలించిన వారికి చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై కురుమూర్తి హెచ్చరించారు.
