కానిస్టేబుల్ సాయి కుటుంబానికి న్యాయం చేయాలి


జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12 :
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో మృతి చెందిన కానిస్టేబుల్ సాయికుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని,వెల్దండ మండల కల్యాణ వాగు తండాకు వాస్తవ్యులు డిసిసి కార్యదర్శి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బాణావత్ శంకర్ నాయక్ బుధవారం ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పై అధికారుల వేధింపుల వల్లే సాయికుమార్ మరణించారని ఆరోపించారు. ఏ శాఖలో పనిచేసిన గిరిజన, ఆదివాసి, ఎస్సీ ఎస్టీ బిడ్డలను వేధింపులకు గురి చేయడం సమాజానికి గుడ్డలు పెట్టు లాంటిదని తీవ్రంగా ఖండించారు. గిరిజన బిడ్డకు ఐదు కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, మృతికి కారణమైన వారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

You may also like...