పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు సుంకిరెడ్డి ఉచిత శిక్షణ.!


కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 14:
కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు,ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగ శిక్షణ అభ్యర్థులకు రెండవ విడత ఉచిత శిక్షణ తరగతులు ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నట్టు టాస్క్ సి.ఓ.ఓ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఐక్యత పౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు మండలాల్లో మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకొని రెండో బ్యాచ్ కు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.ఈనెల 16న కల్వకుర్తి ఓల్డ్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ భవనంలో ఉదయం 09:00 గంటలకు ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా నిర్వహిస్తున్న శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రస్థాయి అత్యుత్తమ అధ్యాపక బృందంతో, ప్రతిరోజు 9 గంటల పాటు ప్రత్యేక తరగతులు,వారంతరపు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కొరకు ఈ నెంబర్,6300553467 ను సంప్రదించాలన్నారు.తాజా సిలబస్ కు అనుగుణంగా నాన్ మ్యాత్స్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.

You may also like...