Author: shrikanth nallolla
శంకర్పల్లి : శంకర్పల్లి మండల డిప్యూటీ MROగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్తీక్ను బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు బండమీది వెంకటేష్ ఘనంగా సన్మానించారు. మంగళవారం శంకర్పల్లిలోని డిప్యూటీ MRO కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బండమీది వెంకటేష్ డిప్యూటీ MRO కార్తీక్కు భగవద్గీతను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలందించాలని ఆకాంక్షించారు.శంకర్పల్లి మండలంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో…
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూరు రాజీవ్ గృహకల్ప వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనను...
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ దళాల కవాతు రిహార్సల్స్ను ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో...
హైదరాబాద్:హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి అజారుద్దీన్, సీఎస్ సంజయ్ జాజు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు,...
రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ వసతి గృహం వద్ద విద్యుదాఘాతానికి గురై ఎంబీఏ విద్యార్థి ఆర్య మృతిచెందాడు. ప్రమాదంతో వసతి గృహంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్ షాక్కు గురైన...
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీటితో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వరదరాజపూర్ గ్రామానికి చెందిన మాజీ...
నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి సబ్స్టేషన్ ఎదుట కరెంట్ కోతలకు నిరసనగా ఆందోళనకు దిగిన రైతులుసబ్స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగినబావాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి గ్రామాలకు చెందిన రైతులు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్Your browser does not support the video tag.
అస్సాంలో భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రామానుజ్ గోస్వామి (28) పోలీసు కస్టడీలోనే మృతి చెందాడు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా కదులుతున్న పోలీసు వాహనం నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున గువాహటిలో ఈ...
పదేళ్లలో 2.5 రెట్లు పెరుగుదల విదేశాల్లో స్థిరపడిన భారతీయులు మాతృభూమికి పంపుతున్న సొమ్ము రికార్డు స్థాయికి చేరింది. రెమిటెన్సుల విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది భారత్కు ఏకంగా 151 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు అందాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.14.47 లక్షల కోట్లు....
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి ఉద్యోగులపై కత్తి దూసింది. సంస్థాగత మార్పుల పేరుతో సోమవారం తెల్లవారుజామునే కొందరు ఉద్యోగులకు తొలగింపు ఈ-మెయిల్స్ పంపింది. అదే రోజు చివరి పనిదినమని ప్రకటించడంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ముందస్తు హెచ్చరిక లేకుండానే ఉద్యోగాలను ఊడబీకిన యాజమాన్య తీరుపై...