Author: shrikanth nallolla
Kవినాయక చవితి పర్వదినాన్ని వ్యాపార ప్రచారానికి వివాదాస్పదంగా ఉపయోగించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. చికెన్ బిర్యానీ ఆఫర్ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లో గణేశుడి చిత్రాన్ని ఉపయోగించడంతో మత మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బ్యానర్‌ను తొలగించడంతో పాటు బిర్యానీ షాపు యజమాని జయంత్ (30)ను అరెస్ట్ చేశారు.తిరునల్వేలి-తిరుచెందూర్ ప్రధాన రహదారిలోని వీఎం ఛత్రం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో రూ.99కే ‘అరబిక్…
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రేపు దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వారు పర్యటించనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఎంపీలు కలవనున్నారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అవసరమైన సహకారం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేయనున్నట్లు సమాచారం….
హైదరాబాద్: నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారులో వెంబడించిన దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో బాధితుడు బండ్లగూడలోని ఓ వైన్స్‌లోకి పరుగెత్తి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతడిని వదలని దుండగులు వైన్స్‌లోకి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు.హత్య అనంతరం నిందితులు కారులో అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడిని ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్‌గా…
తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ పంచ జన్య సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నారు అన్ని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ బేగరి రాజు అన్నారు సోమవారం నాడు మొయినాబాద్ మండల కేంద్రం లో తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ శ్రీమతి ఫాతిమా ఖాన్ ను టిఆర్ఎస్ కండువా…
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థుల సర్టిఫికెట్లలో పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు దొర్లితే ఇక అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చిన్నపాటి అక్షర దోషాల సవరణ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేలా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో సవరణల కోసం ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.సమీపంలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని అవసరమైన పత్రాలను సమర్పించాలి….
వినాయక చవితి వేడుకల వేళ నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో గణపతి పూజ నిర్వహిస్తున్న ఉప్పల దత్తు ప్రసాద్ అనే పూజారి ఆకస్మికంగా కుప్పకూలి మృతిచెందారు. పూజ ఎక్కడ ముందుగా నిర్వహించాలనే అంశంపై స్థానికులతో వాగ్వాదం జరిగిన కొద్దిసేపటికే ఆయన ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.నాగార్జునసాగర్‌కు చెందిన దత్తు ప్రసాద్ చింతలపాలెంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన గుండాల…
వినాయక చవితి పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముఖ్యమంత్రి...
శంకర్పల్లి : విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు ఎస్. జగదీశ్వర్‌కు ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శంకర్‌పల్లిలోని వైభవం బ్యాంకెట్ హాల్ లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు...
తెలంగాణ భవిష్యత్ ప్రాజెక్టుకు కేంద్రం వద్ద ఎందుకీ జాప్యం? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రూపురేఖలను మార్చగల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఒకటి. హైదరాబాద్ చుట్టూ విస్తరిస్తున్న పట్టణీకరణకు దిశానిర్దేశం చేయడంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త పెట్టుబడులు,...
వినాయక చవితి పర్వదినం సందర్భంగా భాగ్యనగరం భక్తి పారవశ్యంతో ముస్తాబైంది. నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రం బేగంబజార్ పరిధిలోని ఫీల్‌ఖానా ప్రాంతంలో కొలువుదీరిన అరుదైన స్వర్ణ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కళాత్మక వైభవం, అపూర్వ అలంకరణ, దివ్యమైన రూపంతో దర్శనమిస్తున్న ఈ గణనాథుడిని వీక్షించేందుకు...