మృతురాలి కుటుంబానికి పరామర్శ – ఆర్థిక సహాయం అందజేసిన కానుగుల జోగయ్య

1001188878.jpg

వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఉమ్మనమైన యాదమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతురాలికి పూలమాలతో నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం రూ.5000 రూపాయలను అందజేశారు. కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు నిరంజన్, లింగం, వార్డు సభ్యులు సిర్సనగండ్ల శేఖర్, పిల్లి దేవేందర్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జంగిలి ప్రవీణ్, జంగిలి రవికుమార్, మట్ట శ్రీనివాస్ గౌడ్, బిట్టి చంద్రశేఖర్,కట్ట అనిల్, బిట్టి వెంకటేష్, బిట్టి సైదులు, పుట్ట శ్రీకాంత్, వానరాసి శేఖర్, వెంకటేష్, బిట్టి రమేష్ బిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...