పోతేపల్లి గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సర్పంచ్ కొండల్ యాదవ్ రూ. 10 వేల విరాళం

1001183409.jpg

వెల్దండ సెప్టెంబర్ 16: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారంగా మండప నిర్వాహకులకు రూ.10,000/- చందాను సర్పంచ్ కొండల్ యాదవ్ అందజేశారు.గ్రామంలో పండుగలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజలందరూ ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.యువత ముందుండి నిర్వహించే ఆజాద్ యూత్ వంటి యువజన సంఘాల కార్యక్రమాలకు అండగా ఉంటామని తెలిపారు.ఈ సందర్భంగా మండప నిర్వాహకులు, ఆజాద్ యూత్ సభ్యులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పోతేపల్లి గ్రామ వార్డు సభ్యులు, ఆజాద్ యూత్ సభ్యులు, యువ నాయకులు మల్లేష్ యాదవ్, ఎగిరిశెట్టి శివ, అంజి యాదవ్, శివ యాదవ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

You may also like...