Author: PAKADI RAMANJANEYULU
వెల్దండ: పోతేపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ సందర్శించారు. మండప నిర్వాహకులు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులతో ఉత్సవాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తనవంతు సహకారంగా రూ.10 వేల విరాళాన్ని మండప నిర్వాహకులకు అందజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ప్రజలంతా ఐక్యతతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు సర్పంచ్ కొండల్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎనుముల…
వెల్దండ: మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సెప్టెంబర్ 21 సోమవారం సాయంత్రం 7:30 గంటలకు ‘ఇరుముడి’ సినిమా ఉచిత ప్రదర్శన నిర్వహించనున్నారు. 10వ వార్డు సభ్యుడు మసిగుండ్ల వెంకటేష్ తన సొంత ఖర్చులతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. తండ్రి–బిడ్డల సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప భక్తి భావనతో తెరకెక్కిన ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే గ్రామ ప్రజలందరూ వీక్షించేలా ఉచితంగా ప్రదర్శించేందుకు ముందుకు వచ్చినట్లు…
వెల్దండ/కల్వకుర్తి, సెప్టెంబర్ 20: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా సెప్టెంబర్ 21న వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఉదయం 10:30 గంటలకు వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో, 11:30 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని రైతు వేదికలలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో విత్తనాల పంపిణీ జరుగుతుందని వెల్దండ మండల పార్టీ అధ్యక్షులు హరి కిషన్ నాయక్, కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలిపారు.సంబంధిత మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు…
నాగర్ కర్నూల్ : దళిత–ఆదివాసీల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులు, సామాజిక సమానత్వం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు నాగర్‌కర్నూల్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డా. మల్లు రవి తెలిపారు. హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన వేదికను ‘శుద్ధీకరణ’ పేరుతో శుద్ధి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది దళిత–ఆదివాసీ సమాజాల ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యగా అభివర్ణించారు.ఈ ఘటనపై జవాబుదారీతనం కోరిన రాహుల్ గాంధీపై…
వెల్దండ: మండలంలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన గోలి గోపాల్ రెడ్డి (55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి సాగర్ కాంప్లెక్స్ వద్ద రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతితో అంకమోనికుంట గ్రామంలో విషాదం నెలకొంది.
కల్వకుర్తి: గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు, నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డీఎస్పీ సైరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. కల్వకుర్తి మండల పరిధిలోని సిలార్పల్లి గ్రామ సమీపంలోని ఈదుల చెరువును పుర కమిషనర్ మహ్మద్ షేక్‌తో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం వరకు గణేష్ విగ్రహాలను ఈదుల చెరువులో నిమజ్జనం చేయాలని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై…
ఆమనగల్: ఆమనగల్ పట్టణంలో రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పురోగతి, నాణ్యత ప్రమాణాలు, వివిధ విభాగాల ఏర్పాట్లపై అధికారులను, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఆమనగల్‌తో పాటు పరిసర…
కల్వకుర్తి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు 2 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం హర్షణీయమని కల్వకుర్తి బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదల సొంతింటి కలను సాకారం…
నాగర్ కర్నూల్ : ఆర్ఎస్పీ ఫౌండేషన్ డైరెక్టర్ కారంగి బ్రహ్మయ్య డా. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత సామాజిక, విద్యా, ప్రజా సమస్యలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. యువత, విద్యార్థులు, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి, సామాజిక న్యాయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో స్వేరోస్ జిల్లా నాయకులు పరామల ప్రకాష్, తోలు…
బాలాపూర్ గణనాథుడికి చల్లా వంశీచంద్‌రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలుబాలాపూర్: బాలాపూర్ ప్రసిద్ధ గణనాథుడిని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, అశ్లేష రెడ్డి దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడంగ్పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆహ్వానం మేరకు వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని…