రోడ్డు ప్రమాదంలో గోలి గోపాల్ రెడ్డి మృతి
- రోడ్డు ప్రమాదంలో గోలి గోపాల్ రెడ్డి మృతి - September 20, 2026
- గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. డీఎస్పీ - September 20, 2026
- ఆమనగల్ ఆరోగ్యానికి భరోసా – రూ. 17.50 కోట్లతో ఆధునిక ఆసుపత్రి నిర్మాణం - September 20, 2026

వెల్దండ: మండలంలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన గోలి గోపాల్ రెడ్డి (55) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి సాగర్ కాంప్లెక్స్ వద్ద రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతితో అంకమోనికుంట గ్రామంలో విషాదం నెలకొంది.
