Author: PAKADI RAMANJANEYULU

ఎఫ్ ఎస్ ఆర్ హాజరు ఆధారంగానే వచ్చే నెల నుంచి జీతాలు.. కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా: వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు ఆధారంగానే చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. హాజరు నమోదులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ నెలాఖరులోగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు నమోదు చేసుకునేలా అధికారులు…

నాగర్ కర్నూల్ ప్రజావాణి కి 58 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్ జిల్లా: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్‌, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

పోలీస్ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

పోలీస్ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్ జిల్లా: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి 13 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు బాధ్యతతో వ్యవహరించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.

వినాయక భక్త బృందానికి జక్కుల చిన్న జంగయ్య యాదవ్ చేయూత

వినాయక భక్త బృందానికి జక్కుల చిన్న జంగయ్య యాదవ్ చేయూతవెల్దండ: మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక భక్త బృందానికి గ్రామానికి చెందిన జియాగూడ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ చేయూత అందించారు.తన వ్యక్తిగత నిధులతో రూ.51 వేల విలువైన మైక్ సెట్, బాక్సులను భక్త బృందానికి వితరణ చేశారు. వినాయక పూజా కార్యక్రమాలు, భక్తి పాటల నిర్వహణకు…

కార్యకర్తల ఐక్యతే కాంగ్రెస్ పార్టీకి బలం – సమిష్టి కృషే కాంగ్రెస్ విజయానికి పునాది

ఆమనగల్: సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్‌ఎస్‌ఏ జాతీయ ఇన్‌చార్జ్ వంశీచంద్ రెడ్డి ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా నియమితులైన ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని, పట్టణ అధ్యక్షులు శ్రీ శివలింగం గారిని అభినందించారు.మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారికి మరింత చేరువగా పనిచేసి పార్టీ…

వినాయకుని సన్నిధిలో ప్రత్యేక పూజలు -గోలి శ్రీనివాస్ రెడ్డి

ఆమనగల్లు, సెప్టెంబర్ 21: వినాయక చవితి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని బుద్ధినాథ్ వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలు, కొబ్బరికాయలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆమనగల్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వినాయకుడిని ప్రార్థించారు. అనంతరం నిర్వాహకులు గోలి శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో…

పేద కుటుంబానికి సీఎం సహాయనిది అండ – 60 వేల చెక్కు అందజేత

వెల్దండ :వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన చెన్నారం కిరణ్‌కు మంజూరైన రూ.60 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేర్క రాజశేఖర్ అందజేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి మంజూరైందని రాజశేఖర్ తెలిపారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం భరోసానిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భీమరాజు, వెంకటయ్య, కిష్టయ్య, సామ బాలరాం, బుర్ర బాలకృష్ణ, విజయేంద్రచారి, చంద్రమౌళి, బాలస్వామి, బొజ్జయ్య, శివ, శ్రీనివాస్, వెంకటయ్య, పప్పు బాలయ్య…

వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు – సిఐ రవీందర్ రెడ్డి

వెల్దండ: గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వెల్దండ పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.డీజేల నుంచి వెలువడే అధిక శబ్దం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, హృదయ స్పందనలో మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలను భజనలు, కోలాట పాటలు, డప్పు వాయిద్యాలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీలకు…

ఎంబీబీఎస్ పేద విద్యార్థికి ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 10 వేల ఆర్థిక సహాయం

వెల్దండ: వెల్దండ గ్రామానికి చెందిన పేద విద్యార్థిని గుద్దటి సరిత ఎంబీబీఎస్ విద్యాభ్యాసానికి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ల సంజీవ్ కుమార్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబానికి అండగా నిలిచిన సంజీవ్ కుమార్‌ను ఎమ్మెల్యే అభినందించారు. పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి సహాయం చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ, ఉపసర్పంచ్ శ్రీను, కాంగ్రెస్ పార్టీ మండల…

ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.. ఎమ్మెల్యే

వెల్దండ: ఆయుర్వేద వైద్యం మన ప్రాచీన వైద్య విధానమని, సహజ పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వెల్దండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక వైద్యంతో పాటు…