కార్యకర్తల ఐక్యతే కాంగ్రెస్ పార్టీకి బలం – సమిష్టి కృషే కాంగ్రెస్ విజయానికి పునాది

ఆమనగల్: సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్‌ఎస్‌ఏ జాతీయ ఇన్‌చార్జ్ వంశీచంద్ రెడ్డి ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా నియమితులైన ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని, పట్టణ అధ్యక్షులు శ్రీ శివలింగం గారిని అభినందించారు.మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుని ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారికి మరింత చేరువగా పనిచేసి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల 1001200098.jpg

ఐక్యత, సమిష్టి కృషితోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు.

You may also like...