ఎంబీబీఎస్ పేద విద్యార్థికి ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 10 వేల ఆర్థిక సహాయం

వెల్దండ: వెల్దండ గ్రామానికి చెందిన పేద విద్యార్థిని గుద్దటి సరిత ఎంబీబీఎస్ విద్యాభ్యాసానికి మార్కెట్ కమిటీ చైర్మన్ వావిళ్ల సంజీవ్ కుమార్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థి కుటుంబానికి అండగా నిలిచిన సంజీవ్ కుమార్‌ను ఎమ్మెల్యే అభినందించారు. పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి సహాయం చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ, ఉపసర్పంచ్ శ్రీను, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్ , వారితోపాటు వార్డు సభ్యులు పురుషోత్తం చారి, గుద్దేటి కిష్టాల్, ముదిగొండ రమేష్,గోసుల కొండయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1001199118.jpg

You may also like...