Author: PAKADI RAMANJANEYULU
కల్వకుర్తి సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన శ్రీమతి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి గారు హైదరాబాద్‌లోని కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…
కల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకునేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్‌ను అందజేశారు. రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నాగిళ్ల వెంకటయ్య, పోతరపల్లి పరమేష్, పోతరపల్లి గెలువమ్మ, పోతరపల్లి సైదులు కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్‌ను అందజేశారు.ఈ సందర్భంగా…
తుక్కుగూడ: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ డ్రైవ్‌లు నిరంతరం కొనసాగిస్తామని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూకు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి 20 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ, యువతకు అందుబాటులోకి వచ్చే ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ…
వెల్దండ: మండలంలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన గోలి గోపాల్‌రెడ్డి (55) ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్‌గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి,గోపాల్‌రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గోపాల్‌రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ,…
రావిచెడు సబ్‌స్టేషన్ ముట్టడి.. రైతులతో కలిసి ఉప్పల వెంకటేష్ ధర్నాకల్వకుర్తి: విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రావిచెడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి మెరుపు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆందోళనలో పాల్గొన్నారు.రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి…
సెప్టెంబర్ 22 ప్రత్యేకం: 1932 సెప్టెంబర్ 22న పూణేలోని ఎరవాడ జైలులో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీజీ మధ్య జరిగిన చారిత్రక భేటీ పూణే ఒప్పందానికి నాంది పలికింది. కమ్యూనల్ అవార్డు ద్వారా అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడాన్ని అంబేడ్కర్ సమర్థించగా, గాంధీజీ దీనిని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.గాంధీజీ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో అంబేడ్కర్‌తో జరిగిన చర్చలు కీలకంగా మారాయి. అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ వంటి…
వెల్దండ: శిలోనిబండ తండా గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్సందర్శించారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తనవంతు సహకారంగా మండప నిర్వాహకులకు రూ.5,000/- విరాళాన్ని సర్పంచ్ కొండల్ యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా మండప నిర్వాహకులు, మున్నా సాదు యూత్ సభ్యులు సర్పంచ్ కొండల్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్నా సాదు యూత్ సభ్యులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి సెప్టెంబర్ 21:రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తలకొండపల్లి కేంద్రంగా కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రతిపాదిత నియోజకవర్గంలో తలకొండపల్లి, ఆమనగల్, కడ్తాల్, కేశంపేట మండలాలను కలపాలనే ఆలోచన ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మండలాలు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాల పరిధి విస్తారంగా ఉండటంతో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి…
నాగర్‌కర్నూల్: అత్యవసరంగా ఓ నెగెటివ్ రక్తం అవసరమని యువజన రెడ్‌క్రాస్ జిల్లా కన్వీనర్ దామగట్ల కుమార్ ఇచ్చిన పిలుపుకు ఇద్దరు రక్తదాతలు కేవలం పది నిమిషాల్లో స్పందించారు. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసు, టిఫిన్ సెంటర్ వ్యాపారవేత్త చంద్రశేఖర్ వెంటనే ముందుకు వచ్చి రక్తనిధి కేంద్రానికి చేరుకుని రక్తదానం చేశారు. దీంతో అవసరమైన రెండు యూనిట్ల ఓ నెగెటివ్ రక్తం సమకూరింది.అత్యవసర సమయంలో ఇచ్చిన పిలుపుకు తక్షణమే స్పందించి రక్తదానం చేసిన…
కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి ఇటీవల నాలుగు రోజుల క్రితం మృతి చెందారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారురాలు, కల్వకుర్తి మాజీ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ విజితా రెడ్డి సింగోటం గ్రామంలోని హర్షవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లారు.ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించి, ఆయన తండ్రి మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు.